• Recent News

    • Meanwhile, chief minister Jagan Mohan Reddy will resume his Memantha Siddham bus yatra on Thursday from Eethakota stay point. He took a day’s break on Wednesday on account of Sri Rama Navami festival. The chief minister’s programme coordinator and MLC Talasila Raghuram said that the bus yatra will go through Tanuku, Ravolapalem, Jonnada and halt at Pottilanka (Kadiyam region) for lunch. He will proceed towards Rajahmundry, passing through Kadiyapulanka, Vemagiri, Morampudi Junction to enter Rajahmundry city. Bus yatra will continue through Tadithota Junction, Church Centre, Devi Chowk, Paper Mill Center, Dewancheruvu, Rajanagaram, and conclude the Day 17 at ST Rajapuram for an overnight stay. The chief minister will not address any public meeting on Thursday. Meanwhile, YSRCP leaders are extremely happy about the overwhelming response received to chief minister’s bus yatra, particularly in West Godavari district. TDP and Jana Sena set high hopes on the kapu dominant Godavari districts to score maximum seats over YSRCP. However, YSRCP which bagged majority seats in the Godavari districts in the last elections, is hopeful of repeating its success particularly after the roaring success of Jagan’s bus yatra in Narsapuram and Eluru Lok Sabha constituencies. Jagan is yet to cover Rajahmundry, Kakinada and Amalapuram constituencies where the party is planning to make it much bigger with Jagan’s roadshows and public meetings.

    • morampudi flyover works

      జాతీయ రహదారిపై మోరంపూడి కూడలి వద్ద పైవంతెన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 రోజుల పాటు ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నామవరం నుంచి రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండు వైపు వెళ్లే వాహనాలు మోరంపూడి సాయినగర్ దుర్గమ్మగుడి పక్క నుంచి గాదాలమ్మ రోడ్డు మీదుగా అప్సరలాడ్జి నుంచి జాతీయ రహదా రిపైకి రావాలన్నారు. సాయినగర్ దుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్న రోడ్డునుంచి గంగి రెడ్ల కాలనీ మీదుగా హుకుంపేట కూడలికి చేరుకోవాలన్నారు. అటుగా వచ్చే భారీ వాహనాలు సాయినగర్ హెచ్పీ పెట్రోల్బంకు ఎదురుగా ఉన్న మార్గం నుంచి గాదాలమ్మనగర్ మీదుగా జాతీయ రహదారికి వైపుగా వెళ్లా లన్నారు. ఆర్టీసీ బస్టాండు నుంచి నామవరం వెళ్లే వాహనాలు వీఎలప్పురం వినాయకుడి గుడి నుంచి రైతుబజార్ మీదుగా మోడలా కాలనీ, కవల గొయ్యి కడలి జాతీయ రహదారిపై నుంచి నిమ్మకాయల మార్కెట్ రోడ్డు, గాదాల మ్మగుడి మీదుగా నామవరం వైపు వెళ్లాలన్నారు. జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నం విజయవాడకు, విజయవాడ నుంచి విశాఖకు వెళ్లే మార్గాల్లో ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. ఆయా మార్గాల్లో రోడ్డు మధ్యలో నుంచి వెళ్లడం, డివైడర్ల దాటి వెళ్లడం వంటివి చేయకుండా ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని డీఎస్సీ కోరారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలన్నారు.

    • రాజమహేంద్రి: మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో నగర వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు సీతా రామకృష్ణ ఆధ్వర్యంలో ఆది వారం పలువురు పార్టీలో చేరగా వారికి అర్బన్ నియోజకవర్గ వైకాపా అభ్యర్ధి భరత్లామ్ వైకాసా కండువాలు కప్పి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు తనపై లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల ఫలితమేమీ ఉండదన్నారు. అభివృద్ధి పనుల్లో తాను కమీషన్లు తీసుకున్నట్లు రుజువు చేస్తే దేని కైనా సిద్ధమన్నారు. కమీషన్లు తీసుకునే సంస్కృతి ఆదిరెడ్డి కుటుం బానిదేనని, అదే దృష్టితో తనపై బురదజల్లుతున్నారన్నారు.

    • సోమాలమ్మ

      Yearly Jathama Utsavas of Patha Somalamma (Old Somalamma) Temple, Syamala Nagar are to be held from 20 to 24 March 2024. Huge Arrangements are being done on the occasion as Goddess Somalamma is said to be the Nagara Devatha (Goddess of Rajahmundry). Thousand of people are expected to visit Old Somalamma Temple Daily during the Festival. Lighting and Painting Activities are going on across the Street. Panchamruthabhishekam, Visesha Alankarana will be done on 20 March, Ekadasi at 4 AM. Later at 10,08 AM Kalasa Sthapana, 10. 30AM – Ganapathi homam and 6PM – Venkateswara Ganamrutham and Lalitha Sahasra Parayana will took place.. Here are the Daily Programs at Old Somalamma Temple.   20 March: 4 AM – అమ్మవారి మూలవిరాట్కు పంచామృతాభిషేకం, విశేష అలంక రణ 10.08 AM – కలశ స్థాపన 10.30 AM – గణపతి హోమం 6 PM – వేంకటేశ్వర గానామృతం, లలితా సహస్రనామ పారాయణ 21 March: 8.30 AM – లక్ష పుష్పార్చన 7 AM – అమ్మవారి పల్లకీ సేవ, ఊయల ఉత్సవం, కోలాటం, సాయిబాబా భజన 22 March: 7 AM – చండీ హోమం 6 PM – సహస్ర జ్యోతిర్లింగార్చన, కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు 23 March: 8 AM – సౌభాగ్య వ్రతం 6 PM – సంగీతం, నృత్య ప్రదర్శన, 24 March: 4 AM – పంచామృతాభిషేకం 4 PM – మేళతాశాలు, గరగ నృత్యాలు, బాణసంచాతో అమ్మవారి జాతర ఊరేగింపు ఉత్సవ దినాలలో ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.  

    • Months of tension on Rajahmundry Rural Assembly Seat has been finally closed. Buchaiah Chowdary of TDP finally secured what he wanted. Kandula Durgesh’s Years of waiting for the MLA Seat has been vanished. Janasena has officially announced today that Kandula Durgesh has been given the Nidadavole MLA ticket. The efforts of Butchaiah have succeeded as he managed to keep the Rajahmundry Rural ticket with him while Kandula Durgesh, who was initially gutted by the sacrifice has been pacified by the Janasena high command and has been relocated to Nidadavole. We could see more such cases in both the parties as the seat distribution discussions continue.  

    • తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుండి అధిక శబ్దాలతో ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.. డిజిటల్ నాయిస్ లెవెల్ మీటర్ ద్వారా చెక్ చేసి 80 డేసిబుల్స్ పైన శబ్దం కలిగించే వాహనాలపై మోటార్ వాహన చట్టం U/S 190 (2) ప్రకారం జరిమానా విధిస్తున్నారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ లో శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న 20 బుల్లెట్ మోటార్ సైకిళ్లను గుర్తించి వాటి సైలెన్సర్లను వాహనదారుల ద్వారా తీయించి నట్టు ట్రాఫిక్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.. ఇక పై ప్రతిరోజు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని.. అధిక శబ్దం చేసే సైలెన్సర్స్ ను బుల్లెట్ మోటార్ సైకిల్ కు అమర్చరాదని వార్నింగ్‌ ఇచ్చారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ లను బిగించే మోటార్ సైకిల్ మెకానిక్ షాపుల వారిపై కూడా చర్యలు తీసుకుంటామని.. మోటారు వాహనాల చట్టం ఉల్లంఘించిన వారిపై కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు రాజమండ్రి ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు.