అన్నీ ఆయుధాల్లోకి శక్తివతమైనది విద్య: ఏపి హై కోర్ట్ జడ్జి జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా

అన్నీ ఆయుధాల్లోకి శక్తివతమైనది విద్య అని, అన్ని విద్య తరువాతి స్థానంలో నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ జడ్జి, ఏపి రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీ జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రం నార్ని కేదారేశ్వరుడు కళావేదిక పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్సా గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక సాధికారకత అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ సమాజంలో ఒక బాధ్యత యుతమైన వ్యక్తిగా మనం ఏది చెయ్యాలో అది చెయ్యాల్సిన సామాజిక బాధ్యత మనపై ఉందన్నారు. ఎవరైనా 20 సమస్యలు పేర్కొన్న సందర్భంలో వాటిలో ఒక్క దానికైన పరిష్కారం చూపగల గాలన్నరు. ప్రతిదీ ప్రభుత్వం, అధికారులే చెయ్యాలనే ఆలోచన విడనాడి చొరవ తీసుకుని ముందుగుడు వేయాల్సి అవశ్యకత ఎంతైనా ముఖ్యం అని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకం అయిన నందున ఆత్మ విశ్వాసంతో కూడి ఉండాలని జస్టిస్ పిలుపు నిచ్చారు. విద్యా ద్వారా అభివృద్ధి సాధ్యమని, విద్యా అనే ఆయుధం ఉంటే సాధ్యం కానిది ఏది ఉండదని ఆయన అన్నారు.

జిల్లా కలక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ డిఎల్ఎస్ఏ కి జిల్లా యత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందజేస్తాన్నారు. ఆర్థిక సాధికరత సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి, జగనన్న విద్యా దివేన, వసతి దీవెన, చేయూత వంటి ఎన్నో నగదు ప్రోత్సహక పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ఆర్థిక సాధకారత సాధించాలంటే సంక్షేమ పథకాలను సద్వనియోగం చేసుకోవాలన్నారు.

ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి మాట్లాడుతూ, ప్రజలకు న్యాయ పరమైన అంశాలలో అండగా ఉంటున్నమన్నరు. ఎన్నో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకుని రావడం ద్వారా రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు.

Rate this post