CPM Pamplet: దరా భారం పై సీపీఎం పార్టీ కరపత్ర ప్రచారం

దేశం, రాష్ట్రంలో ఆకాశాన్నంటుతున్నా దరా భారం పై సీపీఎం పార్టీ కరపత్ర ప్రచారం చేపట్టింది. శనివారం సీపీఎం రాజమండ్రి నగర కమిటీ నగరం లో స్థానిక గణేష్ చౌక్ వద్ద గల రైతు బజార్, జాంపేట ఫిష్ మార్కెట్, దేవి చౌక్ సెంటర్ల లో ధరల పెరుగుదలపై ముద్రించిన కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి బి. పవన్, నగర కార్యదర్శివర్గ సభ్యులు బి. రాజులోవ మాట్లాడుతూ మోడీ అధికారం లోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీలు దాటాయన్నారు. దానితో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయన్నారు. పేద, మధ్యతరగతికి ధరల పెరుగుదల తీవ్ర ఇబ్బందిగా మారిందని అన్నారు. మోడీ, జగన్ ప్రభుత్వాలు ధరలు తగ్గించే చర్యలు చెప్పటం మాని ప్రజలపై అన్ని పన్నులు పెంచి మరింత భారాలు వేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కరెంట్ చార్జీలు, బస్ చార్జీలు పెంచారని, ఆస్తిపన్ను పెంచి, చతపన్ను వసూలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ధరాబారం, పన్నుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు పెరుగుదలకు నిరసనగా ఈ నెల 25న జరుగు సచివలయాల వద్ద నిరసనలో పాల్గొవాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీను, రాజేశ్, పోలిన వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

Rate this post