తూ. గో జిల్లా ఎస్ఈబీ, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నాటుసారా తయారీ, రవాణా నిర్మూలనకు ‘ఆపరేషన్ పరివర్తన 2. 0’ కార్యక్రమాన్ని రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట నగరం గ్రామంలో నిర్వహించారు. ప్రజారోగ్యాన్ని పాడు చేసే నాటుసారా నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాటుసారా తయారు చేసే వ్యక్తులపై నిఘా మరింత పెంచామని అన్నారు.