ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్టేడియం నిర్మాణం కాదు: ఎంపీ భరత్

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానం లో క్రికెట్ స్టేడియం నిర్మాణం చెయ్యడం పైన రక రకాలుగా పుకార్లు రావడం దానికి అఖిలపక్షం సమావేశం నిర్వహించడం, విద్యార్థులను తప్పు దోవ పట్టించడం చేయవద్దని రాజమండ్రి ఎంపీ భరత్ తెలిపారు. మంగళవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఆర్ట్స్ కళాశాలలో వున్న రెండు గ్రౌండ్స్ లో ఒకటి అథ్లెటిక్ గ్రౌండ్ గా చెయ్యడం జరిగింది అని మిగిలి వున్న గ్రౌండ్ ను గ్రీన్ కార్పెట్ తో క్రికెట్ గ్రౌండ్ గా తయారు చేయాలనే ఉద్దేశం తప్ప అక్కడ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం కాదని అయినా క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఆ స్థలం సరిపోదని ఎంపీ భరత్ తెలిపారు. ఏ జిల్లాకు ఇవ్వని విధముగా రాజమండ్రి అభివృద్ధి కొరకు, హావ్లాక్ బ్రిడ్జి అభివృద్ధి, నగర సుందరీకరణ, ముఖ్యమైన జంక్షన్ల వద్ద రహదారులువేయడం ఇలా పలు కార్యక్రమాల కోసం 125 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇవ్వడం జరిగిందని, తన నియోజక వర్గంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఆర్ట్స్ కళాశాల అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ సమావేశంలో రాజానగరం శాసనసభ్యులు, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Rate this post