ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో రాజమండ్రి రౌండప్, ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడిటర్, చిన్నపత్రికల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జమ్మా రాజారమేష్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, కె ఎన్ వెస్లీ దంపతుల సమక్షంలో కేక్ కట్ చేసారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మండేలా శ్రీరామ మూర్తి, అధ్యక్షులు కుడుపూడి పార్ధసారధి, సీనియర్ పాత్రికేయులు వి ఎస్ ఎస్ కృష్ణకుమార్ , శ్రీనివాసరెడ్డి, పలువురు పాత్రికేయులు, కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు పాల్గొని, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.