రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆస్తులను పరిరక్షించుకోవాలని తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమండ్రి నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రికెట్ స్టేడియం నిర్మించవద్దని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆయన వెంట సిటీ నియోజకవర్గ జనసేన ఇన్చార్జి అను శ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.