రాజమహేంద్రవరం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాజమండ్రి కమిటీ అద్యక్షులు సప్పా ఆదినారాయణ ఆధ్వర్యంలో ఎంపీ మార్గాని భరత్ రామ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక పుష్కరాల రేవు వద్ద వందలాది మంది పేదలకు భోజనం ప్యాకెట్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సప్పా ఆదినారాయణ మాట్లాడుతూ ఎంపీ భరత్ రామ్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని, ఇటవంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించార. ఎంపీ ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నందం స్వామి, చొక్కాకుల శ్రీనుబాబు, కొమ్మోజు దుర్గారావు, పొన్నమాటి బాబ్జి, మార్గాని బుజ్జి, మద్దు సతీష్, హితకారిణి సమాజం డైరెక్టర్, సిల్వర్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పోతురాజు సత్తిబాబు, గోవాడ వెంకటేశ్వరరావు, ఉప్పాడ కోటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.