జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని రాజమండ్రి సిటీ నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ అను శ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం సిటీ జనసేన కార్యాలయంలో పార్టీ సభ్యత్వ కిట్లు పంపిణీ చేసి మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా భావించి భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. గ్రామస్థాయిలో జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.