సీఎం జగన్ పాలనలో పేదలకు ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారిందని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి భవానీ పేర్కొన్నారు. పేదలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు. నిలిపివేసిన ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలనే డిమాండ్ చేశారు.