జాతీయ కవి, స్వాతంత్ర్య సమరయో ధుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం 155వ జయంతి వేడుక సోమవారం స్వాతంత్ర్య సమరయోధుల పార్కులోని ఆయన విగ్రహం వద్ద నిర్వహిం చారు. చిలకమర్తి కుడు ఫౌండేషన్ నిర్వాహకుడు పెరుమాళ్ల రఘునాథ్ ఆధ్వ ర్యంలో జరిగిన కార్య క్రమంలో డాక్టర్ అరి నారాయణ రావు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో దురాచారాలపై పోరాటం సాగించిన చిలకమర్తి సమాజ సేవ, సాహితీసేవ రెండింటిలో తనదైన పాత్ర పోషించారన్నారు.
ఎస్ కేవీటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎబెల్ రాజబాబు మాట్లాడుతూ చిలకమర్తి తన రచనల ద్వారా ఆర్జించిన డబ్బును పాఠశాలల స్థాపనకు, పుస్తకాల పంపిణీకి వినియోగించారన్నారు. ముందుగా చిలకమర్తి విగ్రహానికి పూలమాలవేసి. నివాళి అర్పించారు. పి.వి.బి.సంజీవరావు, దేశిరెడ్డి బలరామ నాయుడు. పెది రెడ్ల శ్రీనివాస్, మాదిరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.