‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జిల్లాలోని ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ౩33 పనులకు పరిపాలనా అనుమతి లభించగా వీటిలో ఇప్పటివరకు 202 పనులను ప్రారంభించినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.
మంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు పనులను సమీక్షించారు. దీనిలో కలెక్టర్ తో పాటు జేసి శ్రీధర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చూలిక వసతుల కల్పనకు సంబంధించి 84 సచివాలయాల పరిధిలో చేపట్టాల్సిన 508 పనులను గుర్తించి అప్లోడ్ చేసాం అన్నారు. జిల్లాలో ఇ-క్రాప్ 94 శాతం పూర్తీ చేశామన్నారు. స్పందన ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.