దేవిచౌక్ లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం అమ్మవారు లలితాదేవి అలంకారంలో దర్సనం ఇచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం దేవిచౌక్ వద్ద కూచిపూడి నృత్య ప్రదర్సన మరియు రాత్రి 10 గంటలకు రోషన్ లాల్ ఆర్కెస్ట్రా కార్యక్రమాలు జరుగుతాయి అని నిర్వాహకులు చెప్పారు.