Recent News


  • Are you searching for a Family Lawyer in Rajahmundry? Here is the List of Top Lawyers Near you. No Business Name Address Phone Number Rating Review 1 S Kumar Dr Ave Subbarao Hospital St, Syamala Nagar, Gandhipuram, Rajamahendravaram, Andhra Pradesh 533103 8832467562 4.9 31 reviews Lawyer 2 Lawyer K.V.S.S.PRABHAKAR RAO Second floor, Dr Raja Babu…


  • ఈనెల 20వ తేదీన రాజమండ్రిలోని ప్రధాన తపాలా కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామని డివిజనల్ సూపరింటెండెంట్ పి. కోమల్ కుమార్ శనివారం తెలిపారు. ఇందులో చారిత్రక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సంగీత, క్రీడలు, వన్యప్రాణులు, పక్షి జాతులకు సంబంధించిన విలువైన ఫిలాటలీ స్టాంపులను, ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసిన తపాలా కవర్లను విక్రయిస్తామన్నారు.


  • రాజమండ్రి జే. ఎన్ రోడ్డులోని ఆంధ్రకేసరి సెంటినరీ జూనియర్ కళాశాల అర్ధ శతాబ్ది ఉత్సవం ఈనెల 22న జరుగుతుందని కళాశాల పాలకవర్గం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు హాజరవుతారన్నారు. కళాశాల అభివృద్ధికి కృషిచేసిన విశ్రాంత అధ్యాపకులు, పూర్వపాలకవర్గ సభ్యులకు సత్కారం, అవధాన కార్యక్రమం ఉంటుందన్నారు.


  • రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ఆధునీకరణకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని రాజమండ్రి ఎంపీ మార్గానిభరత్ తెలిపారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. టెర్మినల్ బిల్డింగ్‌కి రూ. 346 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. త్వరలో ఎయిర్‌బస్ వచ్చే విధంగా టెర్మినల్స్ నిర్మాణం జరుగుతుందన్నారు. దీంతో ఎయిర్ పోర్టులో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈ పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి…


  • నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ప్రశాంత జీవనం పొందవచ్చని స్వామి స్మరణానంద గిరి పేర్కొన్నారు. శనివారం యోగదా సత్సంగ ఆత్మ సాక్షాత్కార పాఠాల ఆవిష్కరణ కార్యక్రమం ఆనం కళాకేంద్రంలో ప్రారంభించారు. క్రియాయోగ ధ్యానం కార్యక్రమంలో స్వామి స్మరణానంద గిరి ప్రసంగించారు. చిన్నతనం నుంచి యోగాకు సమయం కేటాయించాలని సూచించారు. అమెరికాలోని ఎస్‌.ఆర్‌.ఎఫ్‌. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన శరత్‌ మాట్లాడుతూ కృష్ణ భగవానుడు బోధించిన క్రియాయోగం గురించి పరిచయం చేశారు. యోగదా సత్సంగ్‌ సొసైటీ ఆఫ్‌…


  • రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 9, 10, 11వ తేదీలలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు రాజమండ్రి సిటీ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అత్తిలి రాజు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్దగల మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నగర ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.